గీసుకొండ కస్టోడియల్ డెత్ పై ఎన్ హెచ్ఆర్సీ సీరియస్..

గీసుకొండ కస్టోడియల్ డెత్ పై  ఎన్ హెచ్ఆర్సీ సీరియస్..

హన్మకొండ జిల్లా గీసుకొండ పోలీస్ స్టేషన్ కస్టోడియల్ డెత్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టింది. ఈ కేసుపై 8 వారాలలోపు నివేదిక ఇవ్వాలని వరంగల్ ఎస్పీ, మెజిస్ట్రేట్కు ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ స్టేషన్లో కస్టడీ డెత్ అయితే ఎందుకు NHRCకి చెప్పలేదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 

ఏం జరిగింది...

హనుమకొండ జిల్లా  వంచనగిరిలో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. 5 తులాల బంగారం చోరీకి గురైంది. ఆ దొంగతనం పొలం వంశీ చేశాడని గీసుకొండ  పోలీసులు అభియోగం మోపారు.  అయితే ఈ దొంగతనం  తాను చేయలేదని....కేసులో తనను అన్యాయంగా ఇరికిస్తున్నారని వంశీ ఆవేదన వ్యక్తం చేశాడు.  నేరం ఒప్పుకోవాలని వంశీని నాలుగు సార్లు పోలీసు స్టేషన్కు పిలిపించారు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 28న వంశీని స్టేషన్కు పిలిపించిన  పోలీసులు..నేరం ఒప్పుకోవాలని చేయి చేసుకున్నారు. తనను అన్యాయంగా హింసిస్తున్నారని.... చేయని తప్పుకు  దోషిగా చిత్రీకరిస్తూ తనపై చేయి చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ..మార్చి 7 న పోలీస్ స్టేషన్ లోనే  కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకుని  వంశీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

పోలీస్ కస్టడీలోనే వంశీ చనిపోయాడని పలు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో న్యూఢిల్లీ లా విద్యార్థి రేవంత్..జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన NHRC 8 వారాలోపు నివేదిక ఇవ్వాలని వరంగల్ ఎస్పీ, మెజిస్ట్రేట్కు ఆదేశాలు జారీ చేసింది