టెర్రరిస్టు కేసుల్లో NIA పాత్ర కీలకం : రాజ్ నాథ్

టెర్రరిస్టు కేసుల్లో NIA పాత్ర కీలకం : రాజ్ నాథ్

హైదరాబాద్‌:  టెర్రరిస్టులకు సంబంధించిన కేసుల్లో NIA పాత్ర కీలకమైందన్నారు కేంద్ర హాంమంత్రి రాజ్ నాథ్ సింగ్. ఆయన ఇవాళ హైదరాబాద్ , మాదాపూర్‌లో NIA రీజనల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సంధర్భంగా మాట్లాడిన  రాజ్‌నాథ్‌ సింగ్‌ .. ప్రపంచంలో టెర్రరిస్టులను తరిమికొట్టేందుకు అన్ని దేశాలు కృషి చేస్తున్నాయన్నారు.

కొన్ని రోజుల క్రితం ఉగ్రవాదులు చొరబడి మన జవాన్స్ పై దాడికి పాల్పడ్డారని… అలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉగ్రవాదాన్ని తరిమికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. కుల, మతాలకు అతీతంగా ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్నామని అన్నారు. ప్రపంచంలో టెర్రరిస్టులను తరిమికొట్టేందుకు అన్ని దేశాలు కృషి చేస్తున్నాయన్నారు. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై దాడి అనంతరం భారత్‌ నుంచి ఉగ్రవాదులను తరిమి కొట్టేందుకు ప్రధాని మోదీ కంకణం కట్టారన్నారు రాజ్ నాథ్.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎన్‌ఐఏ డీజీ వైసీ మోదీ, ఐజీ అలోక్‌ మిత్తల్‌ పాల్గొన్నారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ. 45 కోట్ల వ్యయంతో ఈ నూతన కార్యాలయం, నివాస సముదాయాలను నిర్మించారు. 2016న శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్టు నేడు ప్రారంభోత్సవం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ర్టాలు ఈ ఎన్‌ఐఏ ప్రాంతీయ కార్యాలయ పరిధిలోకి వస్తాయి.