జాతీయ మాల మహానాడు..జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌ల నియామకం

జాతీయ మాల మహానాడు..జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌ల నియామకం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 33 జిల్లాలకు జాతీయ మాల మహానాడు ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌లను నియమించింది. జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సూచనల మేరకు ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌ల నియామకం చేపట్టినట్లు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ గురువారం తెలిపారు. హైదరాబాద్, సిద్దిపేట, మంచిర్యాల జిల్లాలకు ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌గా బైరి రమేశ్‌‌‌‌‌‌‌‌, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి జిల్లాలకు ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌గా చిప్పల నర్సింగరావు, నల్గొండ, సూర్యపేట, ఖమ్మం జిల్లాలకు ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌గా అశోద భాస్కర్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు అసాది పురుషోత్తం, సిరిసిల్ల ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌గా మేడి అంజయ్య, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాకు బ్యాగరి వెంకటస్వామి, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాలకు తుమ్మల రవికుమార్, మెదక్, కామారెడ్డి జిల్లాకు ర్యాకం శ్రీరాములు, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాలకు చిట్టిమళ్ల సమ్మయ్య, హనుమకొండ, కరీంనగర్ జిల్లాలకు వెన్న రాజు, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌గా అనంతరాములు, వరంగల్ జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌గా జెల్ల ప్రభాకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌గా నీరటి రాములు, నిజామాబాద్, జనగామ జిల్లాల ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌గా బుట్టి సత్యనారాయణ, కుమ్రంభీం, ఆదిలాబాద్ జిల్లాల ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌గా బెంజిమన్‌‌‌‌‌‌‌‌ను నియమించారు.