
ఓ కేసుకు సంబంధించి వనపర్తి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. వనపర్తి పట్టణానికి చెందిన మేరీ అనే మహిళను ఓ కట్టెల మిల్లు వ్యాపారి ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వారి ప్రేమకు గుర్తుగా వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత వ్యాపారి మేరీని మోసం మరో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి మేరీని, పిల్లలను గాలికి వదిలేశాడు. అంతేకాకుండా.. ఆ పిల్లలకు తండ్రిని నేను కాను అంటూ కొంత కాలం నుంచి వేధింపులకు గురి చేస్తున్నాడు. దాంతో మేరీ స్థానిక పోలీస్ స్టేషన్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో.. జాతీయ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ అనే సంస్థను సంప్రదించింది. వారి సాయంతో మేరీ.. గత నెలలో జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు తన కేసును పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేసింది. DNA టెస్ట్ జరిపించి తనకు న్యాయం జరిగేలా చూడాలని బాధితురాలు.. జాతీయ మహిళా కమిషన్‌ను వేడుకుంది. మేరీ పిర్యాదుతో స్పందించిన కమిషన్.. సదరు వ్యక్తిపై ఏం చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలతో 15రోజులలో నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలకు నోటీసు పంపింది.
For More News..
సీఎంను చంపితే పది లక్షలిస్తామంటూ పోస్టర్
త్వరలో సిద్దిపేట మున్సిపల్ ఎలక్షన్స్.. పార్టీల ఫోకస్
కూతురితో మహిళా సర్పంచ్ మిస్సింగ్