నేషనల్‌ విమెన్స్‌ టీ 20: చాంపియన్‌‌‌‌ తెలంగాణ

నేషనల్‌ విమెన్స్‌ టీ 20: చాంపియన్‌‌‌‌ తెలంగాణ

– ఫైనల్లో ఉత్తరప్రదేశ్‌ పై ఘన విజయం
జాతీయ స్థాయి మహిళల టీ20 చాంపియన్‌ షిప్‌ లో తెలంగాణ జట్టు విజేతగా నిలిచింది. ఉత్తరప్రదేశ్‌ తో మంగళవారం ఇక్కడ జరిగిన ఫైనల్లో నెట్‌ రన్‌ రేట్‌ ఆధారంగా తెలంగాణ జట్టును విజేతగా ప్రకటించారు. 8 రాష్ట్రాల టీమ్‌ లు పాల్గొ న్న ఈ టోర్నీ ఆసాంతం ఆకట్టుకున్న మన అమ్మాయిలు మంగళవారం జరిగిన ఫైనల్లోనూ అదరగొట్టారు. మొదట బ్యాటింగ్‌‌‌‌ చేసిన ఉత్తరప్రదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 123 రన్స్‌‌‌‌ చేసింది. నీరజ (51) హాఫ్‌ సెంచరీతో రాణించింది.

ఛేజింగ్‌‌‌‌కు దిగిన తెలంగాణ 13 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 82 రన్స్‌‌‌‌ చేసింది. ఈ దశలో వెలుతురు మందగించడంతో రన్‌ రేట్‌ ఆధారంగా నిర్వాహకులు తెలంగాణ జట్టను విజేతగా తేల్చారు. చందన 35 బంతుల్లో 55 పరుగులతో దుమ్మురేపింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో జిల్లా జడ్జీ లక్ష్మణ్‌ , పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌‌‌‌ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు.