దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె..హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ప్రభావం అంతంతే

దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె..హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ప్రభావం అంతంతే

హైదరాబాద్ , వెలుగు:  కేంద్రం గిగ్ వర్కర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చట్టాన్ని  తీసుకురావాలనే డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సోమవారం దేశ వ్యాప్తంగా జరిగిన సమ్మె ప్రభావం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించలేదు. గిగ్​వర్కర్లకు ఉద్యోగ భద్రతతోపాటు ఈఎస్ఐ , పీఎఫ్  , హెల్త్, యాక్సిడెంటల్  బీమా సౌకర్యాలు కల్పించాలని, ఎలాంటి ముందస్తు సమాచారం, విచారణ లేకుండా కంపెనీలు వర్కర్ల ఐడీలను ఏకపక్షంగా బ్లాక్ చేయడాన్ని ఆపాలని గిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్కర్లు డిమాండ్ చేశారు.   

వచ్చే నెల 7న ఓలా, ఉబెర్, ర్యాపిడో, పోర్టర్  బ్రేక్ డౌన్ చేస్తామని తెలంగాణ గిగ్ ప్లాట్ ఫాం వర్కర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనియన్  అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ ప్రకటించారు. ఈ అంశంపై ఇప్పటికే కార్మిక శాఖకు  వినతిపత్రాలు ఇచ్చామని తెలిపారు.