కోనరావుపేట, వెలుగు: శరన్నవరాత్రుల్లో భాగంగా కోనరావుపేట మండలం నాగారంలో దుర్గామాతను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, సింగిల్ విండో చైర్మన్ బండ నరసయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్, డైరెక్టర్లు నాగభూషణం, ప్రభాకర్, నాయకులు రుక్మిణి, భాస్కర్ ఉన్నారు.
దుర్గాదేవికి బోనాలు
రాయికల్, వెలుగు: రామాజీపేట, ఆలూర్, చింతలూర్తదితర గ్రామాల్లో ఆదివారం దుర్గాదేవి బోనాలు ఘనంగా నిర్వహించారు. ఇంటికో బోనంతో మహిళలు మండపాలకు చేరుకొని, అమ్మవారికి పూజలు చేశారు.
చండీయాగం.. కుంకుమ పూజ
ముత్తారం, వెలుగు: నవరాత్రుల్లో భాగంగా దుర్గాదేవి ఆదివారం మహాచండీదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఖమ్మంపల్లి, అడవి శ్రీరాంపూర్, లక్కారం గ్రామాల్లోని అమ్మవారి మండపాల్లో పూజలు చేశారు. ఖమ్మంపల్లిలో లీడర్ యూత్ ఆధ్వర్యంలో చండీయాగం, అన్నదానం చేశారు.
జూలపల్లి, వెలుగు: మండలం కేంద్రంలోని శ్రీఆంజనేయస్వామి ఆలయంలో కొలువుదీరిన దుర్గామాతకు 50 మంది మహిళలు ఆదివారం కుంకుమ పూజ నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. దుర్గామాత కమిటీ సభ్యులు పాల్గొన్నారుకాళరాత్రి దేవి అవతారంలో దుర్గాదేవి
జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల పట్టణంలోని అష్టలక్ష్మి దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి ఆదివారం కాళరాత్రిదేవి అవతారంలో దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో కనకదుర్గ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
కోనరావుపేట, వెలుగు: శరన్నవరాత్రుల్లో భాగంగా కోనరావుపేట మండలం నాగారంలో దుర్గామాతను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, సింగిల్ విండో చైర్మన్ బండ నరసయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్, డైరెక్టర్లు నాగభూషణం, ప్రభాకర్, నాయకులు రుక్మిణి, భాస్కర్ ఉన్నారు.
దుర్గాదేవికి బోనాలు
రాయికల్, వెలుగు: రామాజీపేట, ఆలూర్, చింతలూర్తదితర గ్రామాల్లో ఆదివారం దుర్గాదేవి బోనాలు ఘనంగా నిర్వహించారు. ఇంటికో బోనంతో మహిళలు మండపాలకు చేరుకొని, అమ్మవారికి పూజలు చేశారు.
చండీయాగం.. కుంకుమ పూజ
ముత్తారం, వెలుగు: నవరాత్రుల్లో భాగంగా దుర్గాదేవి ఆదివారం మహాచండీదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఖమ్మంపల్లి, అడవి శ్రీరాంపూర్, లక్కారం గ్రామాల్లోని అమ్మవారి మండపాల్లో పూజలు చేశారు. ఖమ్మంపల్లిలో లీడర్ యూత్ ఆధ్వర్యంలో చండీయాగం, అన్నదానం చేశారు.
జూలపల్లి, వెలుగు: మండలం కేంద్రంలోని శ్రీఆంజనేయస్వామి ఆలయంలో కొలువుదీరిన దుర్గామాతకు 50 మంది మహిళలు ఆదివారం కుంకుమ పూజ నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. దుర్గామాత కమిటీ సభ్యులు పాల్గొన్నారు
కాళరాత్రి దేవి అవతారంలో దుర్గాదేవి