చత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్, నక్సల్ మృతి

చత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్, నక్సల్ మృతి

సుక్మా (చత్తీస్ గఢ్): ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో పోలీసులు ఓ నక్సల్ ను కాల్చిచంపారు. మృతుడిపై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఒడిశాలోని చింతల్నార్ అడవుల నుంచి కొందరు నక్సల్స్ వచ్చారన్న సమాచారం మేరకు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) శుక్రవారం గాలింపు చేపట్టిందని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ చెప్పారు. సాయంత్రం పుస్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు, నక్సల్స్ మధ్య ఎన్ కౌంటర్ జరిగిందన్నారు. పోలీసుల కాల్పుల్లో ఏవోబీ జోనల్ కమిటీ మెంబర్ పొడియమ్ కామా అలియాస్ నాగేశ్ మృతి చెందినట్లు చెప్పారు. స్పాట్ లో తుపాకి, టిఫిన్ బాంబ్, రెండు గ్రనేడ్లు, డిటోనేటర్లు, కార్డె్క్స్ వైర్, మావోయిస్టు లిటరేచర్ ఇతర వస్తులు స్వాధీనం చేసుకున్నామన్నారు. సుక్మాలోని భేజి ఏరియాకు చెందిన నాగేశ్ కలిమెల ఏరియాలో ఆరేళ్లుగా మావోయిస్టు లోకల్ ఆర్గనైజేషన్ స్క్వాడ్ గా పని చేస్తున్నట్లు తెలిపారు.