బాలకృష్ణ ఫ్యాన్స్ కు దీపావళి గిఫ్ట్

బాలకృష్ణ ఫ్యాన్స్ కు దీపావళి గిఫ్ట్

‘అఖండ’ సినిమాతో ఫుల్ జోష్ లో ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపిచంద్ మలినేని దర్శకత్వంలో NBK 107 తెరకెక్కుతోంది. బాలయ్య సరసన ‘శృతిహాసన్’ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో కొనసాగుతోంది. ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు ‘జై బాల‌య్య’ అనే టైటిల్స్‌ ఫిక్స్ చేసినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెట్టే పనిలో పడ్డారు. దీపావళి సందర్భంగా...అక్టోబర్ 21న NBK 107 టైటిల్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

NBK 107 మూవీకి ఏం టైటిల్  పెడతారన్న ఉత్కంఠలో బాలయ్య ఫ్యాన్స్ ఉన్నారు. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. నవీన్ యేర్నేని, వై. రవిశంకర్ లు భారీ ఎత్తున సినిమాను రూపొందిస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ అందించారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ వైవిధ్యమైన పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బాలకృష్ణ మూవీ టైటిల్ కు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.