కర్నూలులో NBK 107 టైటిల్ లోగో వేడుక

కర్నూలులో NBK 107 టైటిల్ లోగో వేడుక

నందమూరి నటసింహం ‘బాలకృష్ణ’ నటించిన ‘అఖండ’ సినిమా మంచి హిట్ సాధించడంతో అదే ఊపులో సినిమాలకు ఒకే చెబుతున్నారు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో NBK 107 పేరిట సినిమా తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా సినిమా షూటింగ్ జరుగుతోంది. బాలయ్య సరసన ‘శృతిహాసన్’ హీరోయిన్ గా నటిస్తున్నారు. సినిమాకు సంబంధించి అప్ డేట్స్ అందిస్తూ.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేస్తున్నారు. తమ అభిమాన నటుడి ఫొటోలు చూసి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇంకా సినిమాకు టైటిల్ ఫిక్స్ చేయలేదు. సినిమా పేరు ప్రకటనకు ముహుర్తం ఖరారు చేశారు. అక్టోబర్ 21న NBK 107 టైటిల్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.  21వ తేదీ సాయంత్రం 8.15 గంటలకు కర్నూలు లోని కొండారెడ్డి బురుజు సెంటర్ వద్ద టైటిల్ లోగో ఆవిష్కరణ ఉంటుందని చిత్ర బృందం వెల్లడించింది.

విడుదల చేసిన పోస్టర్ లో బాలయ్య ఫేస్ కనిపించడం లేదు.  కొండారెడ్డి బురుజు వద్ద బాలయ్య కుర్చీలో  కూర్చుని ఉన్నాడు.  ఆయన ఎదుట కొంతమంది నిలబడి ఉన్నారు. NBK 107 మూవీకి ఏం టైటిల్ పెడతారన్న ఉత్కంఠలో బాలయ్య ఫ్యాన్స్ ఉన్నారు. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. నవీన్ యేర్నేని, వై. రవిశంకర్ లు భారీ ఎత్తున సినిమాను రూపొందిస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ అందించారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.