రాష్ట్రప‌తి పోటీ నుంచి త‌ప్పుకున్న ఫారూక్ అబ్దుల్లా

రాష్ట్రప‌తి పోటీ నుంచి త‌ప్పుకున్న ఫారూక్ అబ్దుల్లా

రాష్ట్రప‌తి ఎన్నిక పోటీ నుంచి త‌ప్పుకున్నట్లు ఎన్సీ నేత ఫారూక్ అబ్దుల్లా తెలిపారు. విప‌క్షాల సంయుక్త అభ్యర్థి జాబితా నుంచి త‌న పేరును తొల‌గిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జ‌మ్మూక‌శ్మీర్ చాలా క్లిష్టమైన ప‌రిస్థితుల్లో ఉంద‌ని, ఇలాంటి స‌మ‌యంలో తాను అక్కడే ఉండ‌డం ముఖ్యమ‌ని ఫారూక్ అభిప్రాయపడ్డారు.

జమ్మూకశ్మీర్ కోసం తాను ఇంకా ఎంతో సేవ చేయాల్సిన అవసరం ఉందన్నారు. తన పేరును ప్రతిపాదించిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు తనపై నమ్మకంతో మద్దతు తెలిపిన రాజకీయ నాయకులందరికీ ఫారూక్ అబ్దుల్లా కృత‌జ్ఞత‌లు తెలియజేశారు.