అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు డానిష్ చిక్నాను గోవాలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(NCB)అరెస్టు చేసింది. డ్రగ్స్ నెట్‌వర్క్‌పై జరుగుతున్న అణచివేతలో ఇదొక కీలక పురోగతి. దేశంలో దావూద్ ఇబ్రహీం డ్రగ్ నెట్‌వర్క్‌ను నడిపిస్తున్న డానిష్ చిక్నా అని గుర్తించారు పోలీసులు.
గత కొన్ని రోజులుగా డానిష్ చిక్నా కోసం వెతుకున్న NCB..దుబాయ్ లో పట్టుబడ్డ హ్యాండ్లర్ మహ్మద్ సలీ షేక్ఇచ్చిన సమాచారంతో తీగ లాగితే డొంకంతా కదిలింది. అక్టోబర్ 23న దుబాయ్ కి చెందిన హ్యాండ్లర్ మహ్మద్సలీం షేక్ ను అరెస్ట్ చేసింది ముంబై క్రైం బ్రాంచ్. సలీం డోలాతో పాటు విదేశాల నుంచి పనిచేస్తున్న కీలక సమన్వయకర్తలలో ఒకరిగా గుర్తించబడిన షేక్, మహారాష్ట్రలో పెద్ద ఎత్తున మెఫెడ్రోన్ తయారీ నెట్‌వర్క్‌తో డ్రగ్స్అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. షేక్ ,డోలా ఇద్దరూ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సన్నిహితులుగా చెబుతారు.
మొహమ్మద్ సలీం సుహెల్ షేక్ పై గతంలో రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. కొన్ని వారాల క్రితం అతన్ని యుఎఇలో అరెస్టు చేసి చట్టపరమైన లాంఛనాలు పూర్తయిన తర్వాత ఇండియాకు తీసుకువచ్చారు.అక్టోబర్ 22న సలీం షేక్ ను అధికారికంగా అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచిందిముంబై క్రైమ్ బ్రాంచ్.
సాంగ్లిలోని ఓ డ్రగ్స్ తయారీ యూనిట్ నెట్ వర్క్ ను షేక్ నడిపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ యూనిట్ లో యూఏఈ నుంచి దిగుమతి చేసుకున్న ముడి కెమికల్స్ ద్వారా సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తున్నారు.
ముంబైలోని కుర్లా ప్రాంతం నుంచి పర్వీన్ షేక్ అరెస్ట్ తర్వాత ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. పర్విన్ దగ్గర రూ. 12.30 లక్షల విలువైన 641 గ్రామాలు మెఫెడ్రోన్, రూ. 12 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పర్వీన్ విచారణలో డ్రగ్స్ సరఫర టీం గుట్టు రట్టయింది.
దుబాయ్ కు చెందిన సలీం షేక్, సలీం డోలా నెట్ వర్క్ నుంచి మీరా రోడ్ నివాసి సాజిద్ మహ్మద్ ఆసిఫ్ షేక్ అలియాస్ దబ్జ్ ద్వారా డ్రగ్స్సరఫరా వస్తున్నట్లు పర్వీన్ విచారణలో తేలింది.
ఈ క్రమంలో సాజిద్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. రూ. 6కోట్ల విలువైన 3 కిలోల మెఫెడ్రోన్ ను సీజ్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఓ మహిళతో సహా 15 మంది నిందితులను అరెస్ట్ చేరశారు. రూ. 256 కోట్ల విలువైన నిషిద్ధ డ్రగ్స్ ను సీజ్ చేశారు.
గత కొన్ని రోజులుగా డానిష్ చిక్నా కోసం వెతుకున్న NCB..దుబాయ్ లో పట్టుబడ్డ హ్యాండ్లర్ మహ్మద్ సలీ షేక్ఇచ్చిన సమాచారంతో బుధవారం (అక్టోబర్29) న గోవాలో అరెస్ట్ చేశారు. దీంతో భారత్ లో దావూద్ ఇబ్రహీం డ్రగ్ నెట్‌వర్క్‌ను కొంతవరకు అడ్డుకోవడంలో NCB సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది.
