53మంది ఎమ్మెల్యేలు మాదగ్గరే: ఎన్సీపీ లీడర్ నవాబ్ మాలిక్

53మంది ఎమ్మెల్యేలు మాదగ్గరే: ఎన్సీపీ లీడర్ నవాబ్ మాలిక్

మహారాష్ట్ర రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. రెండు రోజులుగా కనిపించకుండా పోయిన ఇద్దరు ఎన్సీపీ ఎమ్మెల్యేలు తిరిగి ముంబై వచ్చారు. అనిల్ పాటిల్, దౌలత్ దరోరాను ఎన్సీపీ నేతలు ఢిల్లీ నుంచి తీసుకువచ్చారు. నితిన్ పవార్ నిన్ననే  ఎన్సీపీ  క్యాంపులో చేరిపోయారు. 54 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో 53 మంది మా క్యాంపులోనే ఉన్నారని.. ఆ  పార్టీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ చెప్పారు. బలపరీక్ష పైనే ఫోకస్ చేసిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు జోరుగా చర్చలు జరుపుతున్నారు. మరోవైపు అజిత్ పవార్ ను బుజ్జగించేందుకు ఎన్సీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్సీపీ సీనియర్ నేత చగన్ భుజ్బల్ అజిత్ పవార్ తో చర్చలు జరిపేందుకు అతని ఇంటికి వచ్చారు. ఇక అన్ని పార్టీలు క్యాంపులు కొనసాగుస్తున్నాయి.