తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు

తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు

తెలంగాణలోకి నైరుతి రుతుపవనాల ఎంట్రీతో రాష్ట్రంలో  వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ,రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలకు  అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించనున్నాయని తెలిపింది. రంగారెడ్డి, వికారాబాద్,సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ లో జిల్లాలో ఇవాళ(జూన్ 9) పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

జూన్ 10న ఉమ్మడి ఆదిలాబాద్,కరీంనగర్, వరంగల్, నల్గొండ,రంగారెడ్డి, హైదరాబాద్,మెదక్ జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.  వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట గద్వాల జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపింది వాతావరణ శాఖ తెలిపింది. 

మరో వైపు ఒక్కసారిగా  వాతవరణం మారడంతో హైదరాబాద్ సిటీలోని  నాచారం, మల్లాపూర్ ,తార్నాక, హబ్సిగూడ, ఓయూ క్యాంపస్, లాలాగూడ, లాలాపేట పరిసర ప్రాంతాలలో కురుస్తున్న వర్షం  కారణంగా వాహనదారులు వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు .