లాభాలతో ప్రారంభమై భారీ నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్ మార్కెట్స్.. ఏం జరిగిందంటే..?

లాభాలతో ప్రారంభమై భారీ నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్ మార్కెట్స్.. ఏం జరిగిందంటే..?

దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం లాభాలతో ఉత్సాహంగా ప్రారంభం అయ్యాయి. ఇంట్రాడేలో ఒకానొక దశలో సెన్సెక్స్ సూచీ 600 పాయింట్లు పెరిగినప్పటికీ.. మార్కెట్ల క్లోజింగ్ నాటికి ఆ భారీ లాభాలు ఆవిరైపోయాయి. ఇదే క్రమంలో ఉదయం నుంచి అమ్మకాల ఒత్తిడిలో ఉన్న నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ చివరికి ఊహించని పతనాన్ని మూటకట్టుకుంది. ప్రధానంగా గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన సంకేతాలు దేశీయ మార్కె్ట్ సెంటిమెంట్లను దెబ్బతీశాయని నిపుణులు చెబుతున్నారు. అసలు మార్కెట్లలో ఏఏ కారణాలు లాభాలను ఆవిరి చేశాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

1. వీక్ గ్లోబల్ క్యూస్:
మన మార్కెట్లు పడిపోవడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నెగెటివ్ సిగ్నల్స్. ఆసియా మార్కెట్లయిన జపాన్ నిక్కీ, సౌత్ కొరియా కోస్పి, చైనా షాంఘై, హాంగ్‌కాంగ్ హాంగ్ సెంగ్ అన్నీ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. అటు అమెరికా మార్కెట్లు కూడా నష్టాలతో ముగియడం, వాల్ స్ట్రీట్ ఫ్యూచర్స్ బలహీనంగా ఉండటం మన మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

2. ఎఫ్‌ఐఐల కంటిన్యూస్ సెల్లింగ్:
విదేశీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను భారీగా వెనక్కి తీసుకుంటున్నారు. కేవలం ఒక్క రోజులోనే ఎఫ్‌ఐఐలు ఏకంగా రూ.4వేల 566 కోట్ల విలువైన షేర్లను అమ్మేసి మార్కెట్‌పై తీవ్ర ఒత్తిడి పెంచారు.

3. ప్రాఫిట్ బుకింగ్:
గత కొన్ని రోజులుగా మార్కెట్లు సరికొత్త రికార్డుల వైపు దూసుకెళ్లడంతో.. లభించిన కాస్త లాభాన్ని అయినా జేబులో వేసుకుందామని ఇన్వెస్టర్లు భావించారు. మార్కెట్ గరిష్ట స్థాయిల వద్ద ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున 'ప్రాఫిట్ బుకింగ్'కు పాల్పడటంతో మార్కెట్ తన లాభాలను కోల్పోవాల్సి వచ్చింది.

►ALSO READ | ఉద్యోగుల ప్రతి కమ్యూనికేషన్ ఏఐతో ట్రాక్ చేస్తున్న కాగ్నిజెంట్.. రూ.1900 కోట్ల బిజినెస్ సీక్రెట్!

4. జియోపొలిటికల్ టెన్షన్స్:
అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ మొదలైన ఘర్షణలు ప్రపంచ మార్కెట్లను వణికించాయి. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ తమ యూఎస్ అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేసిందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం, దానికి ప్రతీకారంగా అమెరికా దాడులు ప్రారంభించడంతో గ్లోబల్ సెంటిమెంట్ పూర్తిగా దెబ్బతింది.

5. క్రూడ్ ఆయిల్ షాక్:
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అంతకుముందు 7 వారాల కనిష్టానికి పడిపోయిన బ్రెంట్ క్రూడ్ ధర తాజాగా 0.5% పెరిగి బ్యారెల్‌కు 92 డాలర్లకు చేరుకుంది. చమురు ధరల పెరుగుదల భారతదేశం లాంటి దిగుమతి ఆధారిత దేశాల మార్కెట్లపై ఎప్పుడూ నెగెటివ్ ప్రభావం చూపుతుంది. ప్రస్తుతానికి గ్లోబల్ కారణాల కారణంగా మార్కెట్ సెంటిమెంట్ ప్రస్తుతం చాలా బలహీనంగా ఉందని రెలిగేర్ బ్రోకింగ్ నిపుణుడు అజిత్ మిశ్రా చెప్పారు.