పశ్చిమ బెంగాల్ కేబినెట్..మంత్రులకు శాఖలు కేటాయింపు..సువేందు అధికారి వద్దే హోంశాఖ

పశ్చిమ బెంగాల్ కేబినెట్..మంత్రులకు శాఖలు కేటాయింపు..సువేందు అధికారి వద్దే హోంశాఖ

పశ్చిమ బెంగాల్ సీఎం  సువెందు అధికారి తన మంత్రివర్గ సభ్యులకు శాఖలను కేటాయించారు. ఆర్థిక శాఖను స్వపన్ దాస్‌గుప్తాకు, పరిశ్రమలు ,వాణిజ్య శాఖను తపస్ రాయ్‌కు కేటాయించారు. కీలకమైన హోం శాఖను తనవద్దే ఉంచుకున్నారు. దీంతోపాటు భూ సంస్కరణలు, హిల్ ఎఫైర్స్, రిఫ్యూజీ రిలీఫ్, రిహాబిలిటేషన్ శాఖ, విద్యుత్తు శాఖ, సమాచారా శాఖ ,  సహాయం–పునరావాసం, విద్యుత్, సమాచార–సాంస్కృతిక వ్యవహారాలు, పరిపాలనా సంస్కరణలు వంటి ప్రధాన శాఖలను  కూడా సువేందు అధికారి పర్యవేక్షించునున్నారు. 

ఇక మిగిలిన పట్టణాభివృద్ధి,  పురపాలక వ్యవహారాల శాఖలనుఅగ్నిమిత్ర పాల్‌కు, పాఠశాల విద్య, గృహనిర్మాణం, ఎంఎస్‌ఎంఈ, వస్త్ర పరిశ్రమల శాఖలను దీపక్ బర్మన్‌కు అప్పగించారు.  ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖను శరద్వత్ ముఖర్జీ పర్యవేక్షించనున్నారు. పార్లమెంటరీ వ్యవహారాలు, పర్యాటక శాఖలను శంకర్ ఘోష్‌కు, అర్జున్ సింగ్‌కు కార్మిక, రవాణా శాఖలు కేటాయించారు. రాష్ట్ర మంత్రులలో మాలతీ రావా రాయ్‌కు మహిళా, శిశు అభివృద్ధి శాఖలు, ఇంద్రనీల్ ఖాన్‌కు యువజన సేవలు, క్రీడలు, వినియోగదారుల వ్యవహారాల శాఖలు అప్పగించారు.

►ALSO READ | మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: కాంగ్రెస్ డిమాండ్