చైనా అమ్మాయిలను చూస్తే సన్నగా.. నాజూగ్గా ఉండటమే కాదు ఉత్సాహంగా.. ఉల్లాసంగా కనిపిస్తుంటారు. చైనా అమ్మాయిల ముఖాల్లో ఒత్తిడి చాలా చాలా తక్కువగా కనిపిస్తుందంట.. దీనికి కారణం ఏంటీ.. చైనా అమ్మాయిలు అంత స్టార్ట్‌గా.. ఉత్సాహంగా.. ఉల్లాసంగా ఉండటానికి ప్రధానంగా 6 కారణాలు ఉన్నాయంట.. అవి ఏంటో తెలుసుకుందామా..
1. రాత్రి 11 గంటలలోపే నిద్రపోతారు..
చైనీస్ వైద్య శాస్త్ర నమ్మకం ప్రకారం.. రాత్రి 11 గంటల తర్వాత తెల్లవారుజామున 3 గంటల మధ్య మేల్కొని ఉండటం వల్ల హోర్మన్ల సమతుల్యత దెబ్బతింటుంది. నాడీ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. ఆ సమయాల్లో మేల్కొని ఉండటం వల్ల కొలస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా పెరుగుతాయంట. దీన్ని దృష్టిలో పెట్టుకుని చైనా అమ్మాయిలు 90 శాతం మంది రాత్రి 11 గంటలలోపే నిద్రపోతారంట. ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య నిద్ర లేస్తారంట.
2. వేడి వేడి ఆహారం.. సూప్స్ తినటం..
వేడి ఆహారం తింటారు. అంటే మరీ వేడిగా ఉండకుండా.. అలా అని చల్లగా ఉండకుండా చూసుకుంటారు. పచ్చి ఆహారాలు తినరు. ముఖ్యంగా చికెన్, మటన్ ఏ మాంసాహారం అయినా బోన్ సూప్స్ తీసుకుంటారు. కోడి గుడ్లు, నల్ల నువ్వులు, బెర్రీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, అవకాడో వంటి అధిక పోషకాలు ఉండే ఫుడ్.. తమ రోజువారీ డైట్ లో భాగం చేసుకుంటారు.
3. కఠినమైన వ్యాయామాలకు దూరం..
వ్యాయామం.. జిమ్ విషయంలో చైనా అమ్మాయిలు చాలా లైట్ తీసుకుంటారు. జిమ్ముల్లో కసరత్తులు చేయరంట. వాకింగ్, యోగా, పిలేట్స్ వంటి సింపుల్ వ్యాయామం చేస్తారంట. చెమటలు కక్కేలా.. కండలు కరిగేలా పెద్ద పెద్దగా జిమ్ముల్లో ఏం చేయరంట.
4. ఉపవాసం అనే మాటే ఉండదు అంట..
చైనా అమ్మాయిలు ఉపవాసాలు ఉండరంట. క్రమం తప్పకుండా మితంగా తింటారు. ఉపవాసం చేయటం వల్ల హార్మోన్లు ఇన్ బ్యాలెన్స్ అవుతాయని.. నీరసం వస్తుందని.. దీని వల్ల శక్తి కోల్పోతామనే భావనలో ఉంటారంట. అందుకే ఎంత ఆరోగ్యం బాగోలేకపోయినా ఎంతో కొంత ఫుడ్ మస్ట్ గా తీసుకుంటారంట. శరీరంగానికి ఆహారాన్ని క్రమం తప్పకుండా ఇవ్వటం అనేది ముఖ్యం అని భావిస్తారంట.
5. కాఫీ, టీ, ఆల్కాహాల్ చాలా తక్కువ..
కాఫీ, టీ, ఆల్కాహాల్ వంటివి చాలా చాలా మితంగా తీసుకుంటారంట. వీటి వల్ల శరీరంలో వేడి పెరిగి చర్మ సౌందర్యంగా దెబ్బతింటుందని భావిస్తారు. అంతేకాదండీ కాఫీ, టీ, మందు అనేవి ఖాళీ కడుపుతో అస్సలు తీసుకోరంట. ఏమైనా తిన్న తర్వాతనే వీటిని తీసుకుంటారంట. అది కూడా చాలా తక్కువగా. ఒక రకంగా చెప్పాంటే రోజుకు ఒక కాఫీ, టీ కూడా తాగరంట. ఆల్కాహాల్ అలవాటు ఉన్నా చాలా తక్కువగా.. అది కూడా ఖాళీ కడుపుతో అస్సలు తీసుకోరంట.
ALSO READ : ఉద్యోగుల ప్రతి కమ్యూనికేషన్ ఏఐతో ట్రాక్ చేస్తున్న కాగ్నిజెంట్..
6. రోజులో కొంత సమయం ఒంటరిగా..
ఒంటరిగా ఉండటాన్ని, ఖాళీగా ఉండాన్ని మనం తప్పుగా భావిస్తాం. చైనా అమ్మాయిలు ఒంటరిగా.. ఖాళీగా ఉండటానికి ఇష్టపడతారంట. రోజులో కొంత సమయం.. అది అర గంట కావొచ్చు.. గంట కావొచ్చు.. ఒంటరిగా.. ఖాళీగా ఉంటారంట. ఆ సమయంలో సెల్ ఫోన్లు అస్సలు ముట్టుకోరు. అలా ప్రశాంతంగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారంట. దీని వల్ల మెదడులోని సంఘర్షణలు తగ్గటమే కాకుండా.. మనలో కొత్త శక్తి వస్తుందని భావిస్తారంట.
