ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఒక్క సీసీ కెమెరా 100  మంది పోలీసులతో సమానమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.  చెన్నూరు నియోజకవర్గం భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను  మంత్రి వివేక్ వెంకటస్వామి... రామగుండం పోలీస్ కమిషనర్ (సీపీ) అంబర్ కిషోర్ ఝాతో కలిసి ఘనంగా ప్రారంభించారు.మండల వ్యాప్తంగా నేరాల అదుపు కోసం, శాంతిభద్రతల పరిరక్షణ కోసం సుమారు 80 కీలక కేంద్రాల్లో ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. 

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ... రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు అరైవ్ అలైవ్' (Arrive Alive) కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. నేరాల విచారణలో, నిఘాలో పోలీసులు టెక్నాలజీని వాడుకోవడంలో ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు.

►ALSO READ | కమీషన్ల కోసమే కాళేశ్వరం.. తెలంగాణకు KCR తీరని ద్రోహం చేసిండు: మంత్రి ఉత్తమ్

 థర్డ్ ఐగా పిలిచే ఈ సీసీ కెమెరాల నిఘా వల్ల నేరాలు చాలా వరకు తగ్గుతాయని... ఒకవేళ ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగినా నిందితులను చాలా త్వరగా పట్టుకోవడానికి ఇవి ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించి, రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.