పేరెంట్స్ పర్యవేక్షణలోనే పిల్లలకు వర్చువల్ క్లాసులు

పేరెంట్స్ పర్యవేక్షణలోనే పిల్లలకు వర్చువల్ క్లాసులు

అన్ని రాష్ట్రాలకు ఎన్ సీపీసీఆర్ సూచన
న్యూఢిల్లీ: కరోనా కారణంగా లాక్ డౌన్ తో పిల్లల చదువులకు బ్రేక్ పడింది. దీన్ని అధిగమించడానికి ఎడ్యుకేషన్ ఇన్ స్టిట్యూషన్స్ ఆన్ లైన్ క్లాసెస్ విధానాన్ని వినియోగిస్తున్నాయి. అయితే ఆన్ లైన్ క్లాసెస్ ను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని గుర్తించిన నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్​చైల్డ్ రైట్స్ (ఎన్ సీపీసీఆర్) విద్యా సంస్థలను అలర్ట్ చేసింది. పిల్లలకు ఆన్ లైన్ వీడియో క్లాసులు నిర్వహించే సమయంలో తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు అపెక్స్ చైల్డ్ రైట్స్ బాడీ సూచనలు జారీ చేసింది. చిల్డ్రన్స్ సేఫ్టీ కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ శాఖలకు విడుదల చేసిన అడ్వైజరీలో స్పష్టం చేసింది. డిజిటల్ స్పేస్ లో పిల్లల బాధ్యతలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్న ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్ లదేనని పేర్కొంది. అందుకు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే పిల్లలు వర్చువల్ క్లాసెస్ కు అటెండ్ అవ్వాలని పేర్కొంది. ఆ విషయాలను పేరెంట్స్ కు అర్థమయ్యేలా చెప్పాలని తెలిపింది. స్టూడెంట్స్ సైబర్ బెదిరింపులు, దుర్వినియోగానికి పాల్పడకుండా చూడాలని చెప్పింది. ఇందులో భాగంగా స్టూడెంట్స్ పేర్ల మీద లాగిన్ ఐడీలు ఇవ్వొద్దని, వారు గెస్ట్ లుగా క్లాసెస్ కు హాజరవ్వాలని.. మొత్తం కంట్రోల్ ను టీచర్ల కే అప్పజెప్పాలని వివరించింది.