రేపు (జూలై 13) హైదరాబాద్ కు ఎన్‌‌సీఎస్‌‌సీ చైర్మన్ రాక

రేపు (జూలై 13) హైదరాబాద్ కు ఎన్‌‌సీఎస్‌‌సీ చైర్మన్ రాక

హైదరాబాద్‌‌, వెలుగు: రేపు హైదరాబాద్​కు జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిశోర్ మక్వానా రానున్నారు. ఈ నెల 13న హైదరాబాద్​లోని కవాడిగూడ సీజీజీ టవర్స్ లో రాష్ర్ట ఎస్సీ కమిషన్ ఆఫీస్ ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వివిధ షెడ్యూల్డ్ కుల సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు.

ఇందులో భాగంగా జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ ప్రజలను స్వయంగా కలిసి మాట్లాడుతారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో రివ్యూ చేపట్టనున్నారు. రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చిస్తారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.