కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ ను కట్టడి చేసేందుకు ఆయా దేశాలు అనేక కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్ బారినుంచి రక్షించుకోవచ్చనే విషయాలను తెలియజేస్తున్నారు వైద్యాధి కారులు.
కరోనా వైరస్ పై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మిఊసినా, మూత్ర విసర్జన చేసిన వారికి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించాలని న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (nmdc) నిర్ణయించింది. దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. ఓపెన్ ప్లేస్ లో ఉమ్మి వేయకుండా పరిశుభ్రత పాటించాలని… నిబంధనను ఉల్లంఘించిన వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించడంతో పాటు… పలు సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్.