గోదావరి వరదలో చిక్కుకున్న 8మందిని రక్షించిన ఎస్డీఆర్ఎఫ్

గోదావరి వరదలో  చిక్కుకున్న 8మందిని రక్షించిన ఎస్డీఆర్ఎఫ్

రెంజల్ (నవీపేట్ ), వెలుగు  : గోదావరి వరదలో చిక్కుకున్న 8మంది పూజారులను ఎస్డీఆర్ ఎఫ్   బృందం సురక్షితంగా బయటకు తీసుకు వచ్చింది. నిజామాబాద్  జిల్లా రెంజల్ మండలం లోని కందకుర్తి లో గురువారం సాయంత్రం సీతారాం త్యాగీ మహారాజ్ ఆశ్రమం చుట్టు గోదావరి వరద చేరింది. ఆశ్రమంలో చిక్కుకున్న 8 మందిని ఎస్డీఆర్ బృందాలు బోట్ల సాయంతో బయటకు తీసుకువచ్చారు.