NED vs ENG: డిఫెండింగ్ ఛాంపియన్లు సాధించారు.. నెదర్లాండ్స్‌పై ఇంగ్లాండ్ భారీ విజయం

NED vs ENG: డిఫెండింగ్ ఛాంపియన్లు  సాధించారు.. నెదర్లాండ్స్‌పై ఇంగ్లాండ్ భారీ విజయం

వన్డే ప్రపంచ కప్‌ 2023లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాతో అడుగుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు ఎట్టకేలకు తమ స్తాయికి తగ్గ ప్రదర్శన చేసింది. బుధవారం నెదర్లాండ్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో 160 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత స్టోక్స్(108) రాణించడంతో  339 పరుగుల భారీ స్కోరు చేసిన ఇంగ్లాండ్.. అనంతరం డచ్ బ్యాటర్లను 179 పరుగులకే కట్టడి చేశారు. ఈ టోర్నీలో ఇంగ్లాండ్‌కు ఇది రెండో విజయం.

340 పరుగుల ఛేదనలో నెదర్లాండ్స్‌ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. 37.2 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. వెస్లీ బరేసి(37), సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్(33), స్కాట్ ఎడ్వర్డ్స్(38), తేజ నిడమనూరు (41 నాటౌట్‌) పర్వాలేదనిపించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మోయిన్‌ అలీ, అదిల్‌ రషీద్‌ లు మూడేసి వికెట్లు పడగొట్టగా.. విల్లీ 2, వోక్స్ ఒక వికెట్ తీసుకున్నారు.

అంతకుముందు బెన్ స్టోక్స్ (108), డేవిడ్ మలాన్ (87) రాణించడంతో ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 339 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఈ విజయంతో ఇంగ్లాండ్ ఏడో స్థానానికి ఎగబాకగా, నెదర్లాండ్స్ అట్టడుగున నిలించింది.