పటాన్ చెరులో హైటెన్షన్.. నీలం మధు నామినేషన్ తో ఉద్రిక్తం

పటాన్ చెరులో హైటెన్షన్.. నీలం మధు నామినేషన్ తో ఉద్రిక్తం

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో నామినేషన్ కేంద్ర వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. 2023, నవంబర్ 10వ తేదీ శుక్రవారం నామినేషన్లకు చివరి తేదీ కావడంతో అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్స్ వేయగా..ఈరోజు కూడా పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు వస్తున్నారు. ఈ క్రమంలో పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద నామినేషన్ వేసేందుకు కాంగ్రెస్, బీఎస్పీ పార్టీల అభ్యర్థుల భారీ ర్యాలీగా తరలి వచ్చారు.  కాంగ్రెస్ నుంచి కాట శ్రీనివాస్ గౌడ్, బీఎస్పీ నుంచి నీలం మధు ముదిరాజ్ లు భారీ ర్యాలీతో నామినేషన్ కేంద్రానికి వచ్చారు.

 ఈ కార్యక్రమంలో ఇరు పార్టీల నుంచి వందలాది మంది కార్యకర్తలు వచ్చి హోరాహోరీ నినాదాలు చేశారు. పోలీసులు ఇరు వర్గాలను ఎంత సముదాయించిన వినిపించుకోకపోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మొదట పటాన్ చెరు అభ్యర్థిగా నీలం మధునే కాంగ్రెస్ ప్రకటించింది. అయితే, కాట శ్రీనివాస్ గౌడ్ తనకే పటాన్ చెరు టికెట్ ఇవ్వాలని నిరసనకు దిగి అదిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో చివరి నిమిషంలో నీలం మధకు కాంగ్రెస్ షాక్ ఇస్తూ..కాట శ్రీనివాస్ గౌడ్ టికెట్ ఇచ్చింది. దీంతో నీలం మధు బీఎస్పీలో చేరి.. ఆ పార్టీ తరుపున పటాన్ చెరు బరిలో దిగుతున్నారు.