నీట్ 2026 పరీక్ష రద్దు : పేపర్ లీక్ పై సీబీఐ విచారణ

నీట్ 2026 పరీక్ష రద్దు : పేపర్ లీక్ పై సీబీఐ విచారణ

NEET UG 2026 పరీక్షను రద్దు చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA). రాజస్థాన్ లో పేపర్ లీక్ ఆరోపణలతో పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తదుపరి పరీక్షల తేదీలు త్వరలోనే ప్రకటించున్నట్లు వెల్లడించింది. 

నీట్ పరీక్ష ను రద్దు చేస్తున్నట్లు 2026 మే 10వ తేదీన.. ప్రకటన విడుదల చేసింది ఎన్టీఏ.  పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు జరపనున్నట్లు మే 8న ప్రకటించిన ఎన్టీఏ.. ఇవాళ పరీక్షను రద్దు చేసినట్లు ప్రకటించింది. అదే సమయంలోపేపర్ లీకేజీ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించింది కేంద్రం. 

2026 సంవత్సరానికి గానూ నీట్ పరీక్షను మే 3వ తేదీన నిర్వహించారు. అయితే రాజస్థాన్ లో పేపర్ లీకైనట్లు వార్తలు వచ్చాయి. ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు 48 గంటల ముందు విద్యార్థులకు ఇచ్చిన ప్రాక్టీస్ పేపర్ లోని ప్రశ్నల్లో దాదాపు 600 మార్కుల ప్రశ్నలు ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ లో ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో దేశ వ్యాప్తంగా విద్యార్థులు తల్లింద్రడులు ఆందోళనలకు గరయ్యారు. మరోవైపు తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో పరీక్ష ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఎంబీబీఎస్, బీడీఎస్  కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్  ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) 2026 తెలంగాణ నుంచి 73 వేలకు పైనే మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్స్ కు  అప్లై చేశారు.