రేపు (మే 3) నీట్ యూజీ ఎంట్రెన్స్ ఎగ్జామ్..నిమిషం ఆలస్యమైనా సెంటర్ లోకి నో ఎంట్రీ  

రేపు (మే 3) నీట్ యూజీ ఎంట్రెన్స్ ఎగ్జామ్..నిమిషం ఆలస్యమైనా సెంటర్ లోకి నో ఎంట్రీ  

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్2026) నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. మన రాష్ట్రం నుంచి సుమారు 73 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల్లో 199 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకే అయినా.. మధ్యాహ్నం 1:30 గంటలకే కేంద్రాల గేట్లు మూసివేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

ఆ తర్వాత నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. క్షుణ్ణంగా తనిఖీలు చేయాల్సి ఉన్నందున అభ్యర్థులు ఉదయం 11 గంటల నుంచే సెంటర్లకు చేరుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా 566 నగరాల్లో సుమారు 22.79 లక్షల మంది విద్యార్థులు ఈ మెగా ఎగ్జామ్‌‌కు హాజరవుతున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి మెయిన్ సిటీలతో పాటు కొత్తగా ఆసిఫాబాద్, భూపాలపల్లి, గద్వాల, జనగాం, కొత్తగూడెం, మహబూబాబాద్, వికారాబాద్, జగిత్యాల వంటి జిల్లాల్లో ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ లను పటిష్ట భద్రత, బందోబస్తు మధ్య నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.