సెప్టెంబర్ 12 న నీట్ ఎంట్రన్స్ 

సెప్టెంబర్ 12 న నీట్ ఎంట్రన్స్ 

న్యూఢిల్లీ: వాయిదాలు పడుతూ వస్తున్న నీట్-2021 ప్రవేశ పరీక్ష ఎట్టకేలకు ఖరారైంది. వచ్చే  సెప్టెంబర్ నెల 12న నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 1న పరీక్ష నిర్వహించాలని తొలుత నిర్ణయించినా కరోనా సెకండ్ వేవ్ కేసుల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టినందున.. కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్ సైట్ ద్వారా రేపు సాయంత్రం నుండి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని ఆయన ప్రకటించారు. అందరికీ అందుబాటులో  ఉండాలని.. సోషల్ డిస్టెన్స్ నిబంధనల కారణంగా నీట్ ఎంట్రన్స్ జరిగే పట్టణాల సంఖ్య 155 నుండి 198 కి పెంచారు.