ఆడియో ఈవెంటా.. ప్రీ వెడ్డింగ్ ఫోటో షూటా.. విజయ్, సామ్పై దారుణమైన ట్రోల్స్

ఆడియో ఈవెంటా.. ప్రీ వెడ్డింగ్ ఫోటో షూటా.. విజయ్, సామ్పై దారుణమైన ట్రోల్స్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda) సౌత్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఖుషీ(Khushi). క్లాస్ డైరెక్టర్ శివ నిర్వాణ(Shiva nirvana) తెరకెక్కిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా ప్రమోషన్స్ పనులు మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా మ్యూజిక్ కన్సర్ట్ ఏర్పాటు చేశారు. 

హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరిగిన ఈ ఈవెంట్ చిత్ర యూనిట్ పాల్గొని ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేశారు. ఆ సంధర్బంగా ఖుషి సినిమాలోని ఓ సాంగ్ కు విజయ్, సమంత పెర్ఫామ్ చేశారు. ప్రస్తుతం విజయ్, సమంత చేసిన ఈ పర్ఫార్మెన్స్ పై నెటిజన్స్ ట్రోల్స్ తో రెచ్చిపోతున్నారు. 

నిజానికి విజయ్, సమంత కలిసి స్టేజిపై డ్యాన్స్ చేస్తే బాగానే ఉండేది కాని.. ఎందుకో చాలా ఓవర్ చేశారని అనిపించింది. దీంతో ఈ జంట స్టేజిపై రొమాంటిక్ పర్ఫార్మెన్స్ తో రెచ్చిపోయారనే విమర్షలు వస్తున్నాయి. ఇక విజయ్ అయితే షర్ట్ తీసేసి మరీ సమంతని ఎత్తుకొని చుట్టూ తిప్పేశాడు. ఇది చూడాటానికి కాస్త ఇబందిగా అనిపించింది. ఈ వీడియోలు  కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. అసలు ఇది మ్యూజికల్ ఈవెంటా? లేక  ప్రీ వెడ్డింగ్ ఫోటో షూటా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అంతే కాదు.. వాళ్ళ డ్రెస్సింగ్ పై కూడా నెటిజన్ల కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. స్టేజిపై షర్ట్ విప్పడం ఏంటి? అదే పాటకు చాలా హుందాగా డాన్స్ చేయొచ్చు కదా అని అంటున్నారు. 

ఇంతకుముందు కూడా చాలా మంది హీరోహీరోయిన్స్ కూడా స్టేజిపై డాన్స్ చేశారు. కానీ ఎలా ఇబ్బందిగా అనిపించలేదు. ఈ అతి ఎందుకు అంటున్నారు.ఇక సమంత ఫ్యాన్స్ కూడా ఆమె ఇలా చేస్తుందని అనుకోలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ పై విజయ్ గానీ.. సమంత గానీ ఎలా స్పందిస్తారో చూడాలి.