కింగ్ ఖాన్ లేకుండా డాన్ సీక్వెల్ ఏంటి? డిజప్పాయింట్ అవుతున్న ఫ్యాన్స్

కింగ్ ఖాన్ లేకుండా డాన్ సీక్వెల్ ఏంటి? డిజప్పాయింట్ అవుతున్న ఫ్యాన్స్

షారుఖ్ ఖాన్(Shah rukh khan) హీరోగా 2006లో వచ్చిన డాన్(Don) మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫర్హాన్ అక్తర్(Farhan akthar) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను మరీ ముఖ్యంగా షారుఖ్ ఖాన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకొని డాన్ సినిమాకు సీక్వెల్ గా డాన్2(Don2) ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు మేకర్స్. 2011లో వచ్చిన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. డాన్ సిరీస్ అంటే షారుఖ్ మాత్రమే అనే రేంజ్లో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశారు కింగ్ ఖాన్.

అంతేకాదు ఈ డాన్ సిరీస్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కేవలం ఈ సిరీస్ కోసమే, ఆ పాత్రలో షారుఖ్ ను చూడటం కోసమే వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కూడా ఉన్నారనడంలో ఎలాంటి సందేహంలేదు. ఇందులో భాగంగానే డాన్3 సినిమా కోసం ఈగర్ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. 

అయితే తాజాగా డాన్3(Don3) కి సంబందించిన స్ట్రాంగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అలాగే షారుఖ్ ఫ్యాన్స్ కు షాకిచ్చారు. అదేంటంటే.. డాన్3 కోసం మేకర్స్ షారుఖ్ స్థానంలో రణ్వీర్ సింగ్(Ranveer singh) ను తీసుకున్నారు. దానికి సంబందించిన అనౌన్సమెంట్ వీడియో ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ వీడియోకు ఆడియన్స్ నుండి డిసాస్టర్ టాక్ వచ్చింది. షారుఖ్ లేకుండా డాన్ సినిమా ఏంటి? మీ పిచ్చి కాకపోతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. డాన్ అనే టైటిల్ లో ఉన్న వైటేజ్ రణ్వీర్ లో లేదని.. సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాకి రిలీజ్ తరువాత ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.