ఆర్మీపై ట్వీట్.. వివాదంలో బాలీవుడ్ నటి రిచా చద్దా

ఆర్మీపై ట్వీట్.. వివాదంలో బాలీవుడ్ నటి రిచా చద్దా

గాల్వాన్ ఘ‌ట‌న‌పై బాలీవుడ్ న‌టి రిచా చ‌ద్దా చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది ప్రకటించగా.. ఆ ట్వీట్ కు రిచా.. గాల్వాన్ హాయ్ చెప్తోందని కామెంట్ చేశారు. దీంతో ఆమె చేసిన కామెంట్ ఇప్పుడు  దుమారం రేపుతోంది.

రిచా చేసిన ట్వీట్ పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ఆమె చేసిన పోస్ట్ భార‌త ఆర్మీని చుల‌క‌న చేసిన‌ట్లు ఉందని కొంద‌రు ఆరోపిస్తున్నారు. ఆ వ్యాఖ్యలు సిగ్గుచేటు, అవ‌మాన‌క‌రమని మరికొంద‌రు కామెంట్ చేశారు. 2020 మేలో గాల్వాన్‌లో చైనా, భార‌తీయ ఆర్మీ ద‌ళాల మ‌ధ్య ఘ‌ర్షణ జరిగి 20 మంది భార‌తీయ సైనికులు ప్రాణా త్యాగం చేశారు. అయితే రిచా తాజాగా చేసిన ట్వీట్ ఆ గాల్వాన్ అమ‌ర‌వీరుల‌ను అవ‌మాన‌ప‌రిచిన‌ట్లు ఉంద‌ని నెటిజెన్లు మండిపడుతున్నారు. మరో వైపు బైకాట్ బాలీవుడ్ అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ.. కొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు.