BAN vs SL: ఇలాంటి ఫీల్డింగ్ ఎప్పుడూ చూసి ఉండరు: క్రికెట్ మ్యాచ్‌లో ఫుట్ బాల్ సీన్

BAN vs SL: ఇలాంటి ఫీల్డింగ్ ఎప్పుడూ చూసి ఉండరు: క్రికెట్ మ్యాచ్‌లో ఫుట్ బాల్ సీన్

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ విచిత్ర సంఘటనలతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది. క్రికెట్ లోనే అత్యంత చెత్త రివ్యూ తీసుకొని షాక్ కు గురి చేసిన ఆ జట్టు.. ఆ తర్వాత సింపుల్ క్యాచ్ ను ముగ్గురు ఫీల్డర్లు జారవిడిచారు. ఇక ఇదే టెస్టు సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక అనూహ్య సంఘటన నవ్వు తెప్పిస్తుంది. ఒక బంతి కోసం ఏకంగా 5 గురు ఫీల్డర్లు పరిగెత్తడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

శ్రీలంక సెకండ్ ఇన్నింగ్స్ 20 ఓవర్ రెండో బంతిని బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహమూద్ ఆఫ్ సైడ్ వైపు వేశాడు. ఈ బంతిని శ్రీలంక ప్లేయర్ ప్రభాత్ జయసూరియా పాయింట్ దిశగా  గ్యాప్ లో కట్ చేశాడు. ఈ బంతిని ఆపడానికి అక్కడే ఉన్న నలుగురు స్లిప్ ఫీల్డర్లతో పాటు పాయింట్ లో ఫీల్డింగ్ చేస్తున్న ప్లేయర్ కూడా బౌండరీ ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా 5 గురు ఫీల్డర్లు పరిగెత్తడంతో వీళ్ళు క్రికెట్ ఆడుతున్నారా.. లేకపోతే ఫుట్ బాల్ ఆడుతున్నారా అని నెటిజన్స్ సెటైర్స్ వేస్తున్నారు. మరికొంతమంది నెటిజన్స్ ఈ సీన్ బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ లగాన్ సినిమాను గుర్తు చేసిందని చెప్పుకొచ్చాడు. 

ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే..511 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. ఐదో రోజు బంగ్లాదేశ్ గెలవాలంటే మరో 243 పరుగులు చేయాల్సి ఉంది. మరోవైపు శ్రీలంక గెలవాలంటే మూడు వికెట్లు తీయాల్సి ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 531 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ కేవలం 178 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్ లో బంగ్లా బౌలర్లు విజృంభించడంతో 7 వికెట్లకు 157 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.