యానిమల్గా మారిన కిరాతకుడు.. ఇదే అసలైన ట్విస్టు

యానిమల్గా మారిన కిరాతకుడు.. ఇదే అసలైన ట్విస్టు

బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్(Ranbir Kapoor), నేషనల్ క్రష్ రష్మికా మందన్నా(Rashmika Mandanna) కలిసి నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్(Animal). మోస్ట్ వైలెంట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. టీజర్, ట్రైలర్ తో ఆ అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇదిలా ఉండగా యానిమల్ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన కిరాతకుడు సినిమా గురించి తెలుసుకదా. కాస్త అటూ ఇటూగా యానిమల్ సినిమా కూడా అలానే ఉంటుందట. పెద్ద స్దాయిలో ఉన్న తండ్రి, ప్రక్క దారి పట్టిన కొడుకు. చివరికి వచ్చేసరికి తనని ద్వేషించే తండ్రిని విలన్స్ నుండి రక్షించుకొని.. తండ్రిపై తనకున్న ప్రేమను తెలియజేస్తాడు. యానిమల్ ట్రైలర్ చూశాక చాలా మందికి చిరంజీవి కిరాతకుడు సినిమా గుర్తొచ్చింది. దీంతో రెండు సినిమాల షాట్స్ ను యాడ్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి ఇది నిజమా లేక రూమరా అనేది తెలియాలంటే.. డిసెంబర్ 1వరకు ఆగాల్సిందే.

Also Read :- హీరో విశాల్కు సీబీఐ నుండి పిలుపు.. కలలో కూడా అనుకోలేదట పాపం!