ఎరక్కపోయి.. ఇరుక్కున్నాడు

ఎరక్కపోయి.. ఇరుక్కున్నాడు

ఓ స్టార్ హీరో సినిమాకు రివ్యూ ఇచ్చి... మరొక స్టార్ హీరో చిక్కుల్లో పడ్డాడు. సినిమా బాగుందని చెప్పినందుకు... అది తన సినిమాకే ఎసరు పెట్టింది. ఇంతకీ ఆ సినిమా ఏంటీ.. ఆ స్టార్ హీరో ఎవరు అన్న విషయానికొస్తే.. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన సినిమా లాల్ సింగ్ చద్దా ఇటీవలే రిలీజైన విషయం తెలిసిందే. కాగా.. గత కొంతకాలం నుంచి ఈ మూవీని బాయ్ కాట్ చేయాలంటూ నెటిజన్లు ట్రోల్ చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే.. రీసెంట్ గా ఈ సినిమా విడుదల కావడంతో నటుడు హృతిక్ రోషన్ ఈ మూవీని వీక్షించారు. దాంతో పాటు లాల్ సింగ్ చద్దా జస్ట్ బ్యూటీఫుల్ అంటూ కామెంట్ చేశారు. 

అయితే.. ఇప్పుడు హృతిక్ ఇచ్చిన రివ్యూకు నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ కోపం కాస్తా హృతిక్ సినిమాపై పడింది. తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతి నటించిన 'విక్రమ్ వేద' సినిమా హిందీలో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ నటీనటులుగా రూపొందుతోంది. కాగా ఈ విక్రమ్ వేదను బాయ్ కాట్ చేయాలని తాజాగా పలువురు పిలుపునిస్తున్నారు. దీంతో అమీర్ సినిమాను ప్రశంసించడం వల్లనే నెటిజన్లు కోపాన్ని హృతిక్ సినిమా మీద ప్రదర్శిస్తున్నట్టు సమాచారం.