- ఇప్పటివరకు 2.60 లక్షల అప్లికేషన్లు
హైదరాబాద్, వెలుగు: టీజీఎప్ సెట్ దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 4 వరకు ఆఖరి గడువు ఉందని సెట్ కన్వీనర్ డాక్టర్ విజయకుమార్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,60,427 దరఖాస్తులు అందాయని తెలిపారు. దీందులో ఇంజినీరింగ్ స్ట్రీమ్ నుంచి 1,84,027 మంది, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో 76,162 మంది, రెండు స్ర్టీములు కలిపి 238 మంది అప్లై చేసుకున్నారని పేర్కొన్నారు.
రూ.250 ఫైన్‌తో ఏప్రిల్ 10 వరకు, రూ.500 ఫైన్‌తో ఏప్రిల్ 15 వరకు, రూ.2500 ఫైన్ తో 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. రూ.5 వేలతో మే 2 వరకు దరఖాస్తు చేసుకునే చాన్స్ ఉందని తెలిపారు.
