ఉద్యోగ నోటిఫి కేషన్లు వెంటనే విడుదల చేయాలి : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

ఉద్యోగ నోటిఫి కేషన్లు వెంటనే విడుదల చేయాలి : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
  • ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా బహిరంగంగా వెల్లడించాలన్నారు. సోమవారం కౌన్సిల్‌లో స్పెషల్​ పిటీషన్స్​ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ .. “ఉద్యోగాలు భర్తీ చేయలేకపోతే ఓట్ల కోసం చెప్పామని చెప్పండి. అప్పుడు నిరుద్యోగులు అనవసరంగా ఆశలు పెట్టుకోరు” అని వ్యాఖ్యానించారు. 

ప్రతీసారి నిరుద్యోగులు పిటిషన్లు ఇచ్చి తమను సంప్రదించడం ఇబ్బందిగా మారుతోందన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోకు కట్టుబడి ఉన్నట్లు నిరూపించుకోవాలని సూచించారు. హామీలను అమలు చేయకపోతే అది వారి ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని తీన్మార్​ మల్లన్న పేర్కొన్నారు.