హైదరాబాద్, వెలుగు: ఏఐ ఆధారిత అటానమస్ ప్లాట్‌ఫారమ్ వేదిక ఎమాగియా కొత్త జియా ఆర్డర్ ఎంట్రీ సూపర్ ఏజెంట్‌ను విడుదల చేసింది. వినియోగదారుల కొనుగోలు ఆర్డర్లను ఆటోమేటిక్ పద్ధతిలో సేకరించి ప్రాసెస్ చేయడం ఈ ఏఐ టూల్ ప్రత్యేకత. దీనివల్ల ఆర్డర్ ప్రాసెసింగ్ వేగం 10 రెట్లు పెరుగుతుంది.
మానవ ప్రమేయం లేకుండానే 80 శాతం నుంచి 95 శాతం వరకు ఆర్డర్లను పూర్తి చేయవచ్చు. ఇది సాప్, ఒరాకిల్ వంటి ఈఆర్పీ సాఫ్ట్‌వేర్‌లతో సులభంగా అనుసంధానమవుతుంది. వ్యాపార కార్యకలాపాల్లో తప్పులను తగ్గించి కచ్చితత్వాన్ని పెంచుతుందని సంస్థ సీఈఓ వీణా గుండవెల్లి వివరించారు.
