జూన్ ఫస్ట్ వీక్ నుంచి రాష్ట్రమంతా టీఎస్ బీపాస్​

జూన్ ఫస్ట్ వీక్ నుంచి రాష్ట్రమంతా టీఎస్ బీపాస్​

హైదరాబాద్‌‌, వెలుగుఇళ్ల నిర్మాణాలకు ఆన్‌‌లైన్‌‌లో పర్మిషన్స్‌‌ ఇచ్చే టీఎస్​ బీపాస్​ విధానాన్ని జూన్ మొదటి వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని మున్సిపల్, ఐటీ మినిస్టర్‌‌ కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌‌లోని  మున్సిపల్​కాంప్లెక్స్​లో గురువారం మున్సిపల్,  జీహెచ్‌‌ఎంసీ, హెచ్‌‌ఎండీఏ అధికారులతో టీఎస్​బీపాస్‌‌(టీఎస్ బిల్డింగ్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్‌‌)పై మంత్రి కేటీఆర్​సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 87 మున్సిపాలిటీల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టామని, ప్రస్తుతం ఆయా మున్సిపాలిటీల నుంచి వస్తున్న అప్లికేషన్లను ఆన్‌‌లైన్‌‌లో పరిశీలిస్తూ పర్మిషన్స్‌‌ ఇస్తున్నట్టు ఉన్నతాధికారులు మంత్రికి చెప్పారు. ఇప్పటివరకు సుమారు 1,100 అప్లికేషన్లు రాగా, వాటిలో కొన్నింటికి పర్మిషన్స్‌‌ ఇచ్చినట్టు వెల్లడించారు. ఇందుకు వాడుతున్న సాఫ్ట్​వేర్, సపోర్టింగ్​సిస్టమ్‌‌పై  ఫీల్డ్​నుంచి మంచి ఫీడ్‌‌బ్యాక్‌‌ వచ్చిందని, వచ్చే 15 రోజుల్లో ఇంకా మార్పులుచేసి పూర్తిగా అందుబాటులోకి తెస్తామన్నారు. టీఎస్​ బీపాస్‌‌పై పనిచేసే సిబ్బందికి శిక్షణ, అవగాహన కార్యక్రమాలను త్వరగా పూర్తి చేయాలని, దీనిపై ఒకట్రెండు రోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని కలెక్టర్లు, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లతో స్పెషల్‌‌ మీటింగ్‌‌ ఏర్పాటు చేయాలని అధికారులకు కేటీఆర్​ సూచించారు. టీఎస్‌‌ బీపాస్‌‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాగానే మీసేవ, ఇతర ఇంటర్నెట్‌‌ సెంటర్స్‌‌, మొబైల్ యాప్ ద్వారా అప్లికేషన్‌‌ పెట్టుకునేలా అవకాశం ఇవ్వాలన్నారు. ఇబ్బందులొస్తే సంప్రదించేందుకు కాల్​సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు.

వచ్చే నెలలో వ్యాక్సిన్ ట్రయల్‌ రిజల్ట్స్‌