ములకలపల్లి, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో మంగళవారం అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పట్వారి గూడెం- భద్రాచలం మధ్య పల్లెవెలుగు బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈ బస్సు సత్తుపల్లి డిపో నుంచి ములకలపల్లి మండలంలోని చౌటిగూడెం, పొగళ్లపల్లి, తిమ్మంపేట పంచాయతీ గ్రామాల మీదుగా భద్రాచలానికి వెళ్తుంది. బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే ములకలపల్లి నుంచి తిమ్మంపేట వరకు ప్రయాణించారు.
అనంతరం పొగళ్లపల్లిలో ముగ్గురు లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు, ఒడ్డుగూడెం, మొండి వర్రే, భగత్ సింగ్ నగర్ గ్రామాల్లో పాఠశాల ప్రహరీలు, ఎస్ఎస్ జీ కమ్యూనిటీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ములకలపల్లి రైతు వేదికలో మండల అధికారులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, సర్పంచులతో సమావేశం నిర్వహించారు.
