భద్రాచలం, వెలుగు: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణ్పూర్జిల్లాలో మావోయిస్టులకు చెందిన భారీ డంప్ ను శుక్రవారం భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. జిల్లాలోని ఓర్చా పోలీస్స్టేషన్టేక్లా అటవీ ప్రాంతలో భద్రతాబలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా.. డంప్ కనిపించింది.
ఇందులో ఇన్సాస్రైఫిల్, రెండు మేగజైన్లు, 21 ఇన్సాస్రౌండ్లు, రెండు ఎస్ఎల్ఆర్లు, నాలుగు మ్యాగజైన్లు, 63 రౌండ్లు, రెండు 303 రైఫిల్స్, 65 రౌండ్స్, ఓసీ రౌండ్లు, 30 ఓసీ మేగజైన్లు, బీజీఎల్ లాంచర్, సింగిల్షాట్గన్, మూడు డిటోనేటర్లతో పాటు రూ. 24 లక్షలు దొరికాయి. వీటిని స్వాధీనం చేసుకొని నారాయణ్ పూర్ జిల్లా కేంద్రానికి తరలించినట్లు బలగాలు తెలిపాయి.
