
కరోనా వైరస్‌కి చెందిన మరో వేరియంట్‌ని గుర్తించినట్లు అమెరికా వ్యాధి నియంత్రణ ఏజెన్సీ వెల్లడించింది. దానికి బీఏ.2.86 అని పేరు పెట్టామని.. ఇజ్రాయిల్, డెన్మార్క్, అమెరికాలో దీనిని కనిపెట్టినట్లు చెప్పింది.
తాజా సమాచారం ప్రకారం ఈ వేరియంట్ 3 దేశాలకు పైగా వ్యాపించినట్లు యూఎస్ అధికారులు చెబుతున్నారు. ఈ సంస్థ కొవిడ్‌లో ఉత్పరివర్తనాలపై ఏళ్లుగా అధ్యయనం చేస్తోంది. సెంటర్స్ఫర్డిసిజ్కంట్రోల్ అండ్ప్రివెన్షన్తెలిపిన వివరాల ప్రకారం.. కరోనాలో ఇలాంటి వేరియంట్లు మరికొన్ని వచ్చే అవకాశం ఉంది.
ఈ వ్యాధికి కారణమయ్యే సార్స్‌కోవ్ 2 తో సహా అన్ని వైరస్లు కాలక్రమేణా మారుతూ ఉంటాయి. చాలా మార్పులు వైరస్లక్షణాలపై ప్రభావం చూపనప్పటికీ అది సులభంగా వ్యాపించేందుకు కారణమవుతాయి.
ప్రస్తుతం XXB.1.5 వేరియంట్36 ఉత్పరివర్తనలు కలిగి ఉంది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న టీకాలు వేరియంట్ల నుంచి రక్షిస్తాయా లేదా అనేది ప్రస్తుతం సవాలుగా మారింది.