కొత్త GST రేట్ లిస్ట్: ఏ ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు ఇవాళ్టి నుండి మారనున్నాయంటే..?

 కొత్త GST రేట్ లిస్ట్: ఏ ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు ఇవాళ్టి నుండి మారనున్నాయంటే..?

ఇండియాలో GST 2.0 అమల్లోకి వచ్చాక పన్ను స్లాబ్‌లు 0 శాతం, 5 శాతం, 18 శాతం, 40 శాతంగా మారాయి. దింతో 28 శాతం పన్ను కిందకి వచ్చే 90 శాతం వస్తువులు ఇప్పుడు 18 శాతానికి మారాయి. వినియోగదారులపై భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకుగా, ముఖ్యంగా గృహోపకరణాలపై  పన్ను ప్రభావం మరింత తగ్గుతుంది. ఈ మార్పులు స్మార్ట్ టీవీలు నుండి స్మార్ట్ గృహోపకరణాల వంటి పెద్ద వస్తువులపై డబ్బు ఆదా చేస్తాయి, కంపెనీలు ఇప్పుడు ఉత్పత్తిని బట్టి ధరలను 10 శాతం వరకు తగ్గించే అవకాశం ఉంది.  

కొత్త పన్ను విధానం కింద కొత్త, లేటెస్ట్ కనెక్టివిటీకి మొబైల్ ఫోన్ల పై GST రేట్ మార్పు లేదు, అంటే ముందు ఉన్నట్లే 18 శాతం GST  ఉంటుంది. ల్యాప్‌టాప్‌ల ధరల పై కూడా 18 శాతం GST రేటు అలాగే ఉంది.  హెడ్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్‌లు, పోర్టబుల్ స్పీకర్‌ల వంటి ఆడియో డివైజెస్ పై  18 శాతం GST స్థిరంగా కొనసాగుతుంది. 

ఇక స్మార్ట్ టీవీల విషయానికొస్తే  GST 2.0 అమలుతో స్మార్ట్ టీవీలపై అతిపెద్ద ప్రయోజనం అందిస్తున్నాయి. సెప్టెంబర్ 22 నుండి వీటి gst రేట్లు 28 శాతం నుండి 18 శాతానికి చేరాయి. అంటే వీరి ధరలు మరింతగా తగ్గుతాయి. 

 స్మార్ట్ అప్లియన్స్ : రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లు వంటి స్మార్ట్ హోమ్ అప్లియన్స్ పై GSTని 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించాయి.  పండగ సీజన్లో ఎక్కువగా అమ్ముడుపోయే వీటి పై GST తగ్గడంతో ఇంకా చౌకగా లభిస్తాయి. ఇవి కాకుండా ఇంకా ఇతర టెక్ ఉత్పత్తుల పై కూడా  GST రేట్లు 28 శాతం నుండి 18%కి తగ్గాయి. డిష్‌వాషర్ల నుండి కంప్యూటర్ మానిటర్లు, ప్రొజెక్టర్లు వంటి వస్తువులపై గతంలో అధిక సుంకాలు ఉండేవి.