జ్వరం తగ్గితే డిశ్చార్జ్‌‌..కొత్త గైడ్ లైన్స్ ఇవే..

జ్వరం తగ్గితే డిశ్చార్జ్‌‌..కొత్త గైడ్ లైన్స్ ఇవే..

వరుసగా మూడ్రోజుల పాటు జ్వరం లేకుంటే, టెస్టులు చేయకుండానే కరోనా పేషెంట్‌‌ను డిశ్చార్జ్ చేయొచ్చని సెంట్రల్​ హెల్త్​ మినిస్ట్రీ ప్రకటించింది. వైరస్ లక్షణాలు లేనివారికి, తక్కువగా ఉన్నవారికి మాత్రమే ఈ రూల్​ వర్తిస్తుందని స్పష్టం చేసింది. డిశ్చార్జ్ తర్వాత 7 రోజుల పాటు హోం ఐసోలేషన్‌‌లో ఉండాలని సూచించింది. ఈ మేరకు కరోనా పేషెంట్ల డిశ్చార్జ్​కు సంబంధించి శనివారం కొత్త గైడ్​ లైన్స్​ రిలీజ్​ చేసింది. ప్రస్తుతం వరుసగా నాలుగైదు రోజులు లక్షణాలు కనిపించని పేషెంట్లకు ఆర్టీ పీసీఆర్‌‌ టెస్ట్ చేస్తున్నారు. ఇందులో నెగెటివ్ వస్తే మరోసారి టెస్టు చేస్తారు. ఈ రెండింట్లో నెగెటివ్ వస్తే డిశ్చార్జ్ చేస్తున్నారు. ఆ తర్వాత 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌‌లో ఉంచుతున్నారు.

హైదరాబాద్‌‌, వెలుగుకరోనా పేషెంట్లను దవాఖాన్ల నుంచి డిశ్చార్జ్ చేసే విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా మూడ్రోజుల పాటు జ్వరం లేకుంటే, టెస్టులు చేయకుండానే పేషెంట్‌‌ను డిశ్చార్జ్ చేయొచ్చని సూచించింది. వైరస్ లక్షణాలు లేనివారికి, తక్కువగా ఉన్నవారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రస్తుతం నాలుగైదు రోజులు వరుసగా లక్షణాలు కనిపించని పేషెంట్లకు ఆర్టీ పీసీఆర్‌‌ టెస్ట్ చేస్తున్నారు. ఇందులో నెగెటివ్ వస్తే మరోసారి టెస్టు చేయిస్తారు. 24 గంటల వ్యవధిలో రెండుసార్లు టెస్టు చేయించి రెండింట్లో నెగెటివ్ వస్తే డిశ్చార్జ్ చేస్తున్నారు. డిశ్చార్జ్ తర్వాత ఇంట్లో 14 రోజుల పాటు క్వారంటైన్‌‌లో ఉంచుతున్నారు. తాజా మార్గదర్శకాల్లో కేవలం సీరియస్‌‌గా ఉన్న పేషెంట్లకు మాత్రమే డిశ్చార్జ్‌‌కు ముందు టెస్ట్ అవసరమని పేర్కొన్నారు. డిశ్చార్జ్ తర్వాత కేవలం 7 రోజుల పాటు హోమ్‌‌ ఐసోలేషన్‌‌లో ఉండాలని చెప్పారు.

కొత్త  గైడ్‌‌లైన్స్ ఇలా..

మైల్డ్‌‌ సింప్టమాటిక్ పేషెంట్స్‌‌

కరోనా వచ్చినప్పుడు తక్కువ లేదా అసలే సింప్టమ్స్ లేని వారికి డిశ్చార్జ్ సమయంలో టెస్ట్ అవసరం లేదు. టాబ్లెట్స్ వాడకున్నా, వరుసగా 3 రోజులు జ్వరం లేకపోతే వీరిని డిశ్చార్జ్ చేయొ చ్చు. ఈ 3 రోజులు బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్ సరిపడా ఉండాలి. ఇబ్బంది లేకుండా ఊపిరి తీసుకోగల గాలి. ఇలా ఉంటే ఆర్టీపీసీఆర్‌‌‌‌ టెస్ట్‌‌ చేయకుం డానే డిశ్చార్జ్ చేయొచ్చు. అయితే పేషెంట్‌‌కు సింప్టమ్స్ వచ్చి 10 రోజులు దాటి ఉండాలి.

మోడరేట్‌‌ సింప్టమాటిక్ పేషెంట్లు

వైరస్ పాజిటివ్ వచ్చిన సమయంలో కరోనా లక్షణాలు మోడరేట్‌‌(మధ్యస్థంగా)గా ఉన్నవారికి కూడా డిశ్చార్జ్‌‌ సమయంలో టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. హాస్పిటల్‌‌లో చేరిన మూడు రోజుల్లోపు జ్వరం పూర్తిగా తగ్గి, ఆ తర్వాత 4 రోజుల పాటు బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్‌‌ సరిగా ఉంటే టెస్ట్ చేయకుండానే వీళ్లను డిశ్చార్జ్ చేయొచ్చు. అయితే, వైరస్ లక్షణాలు మొదలై అప్పటికే 10 రోజులు గడవాలి.

సీరియస్‌‌ పేషెంట్లకు తప్పనిసరి

వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న పేషెంట్లు, హెచ్‌‌ఐవీ, కేన్సర్‌‌‌‌ సహా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే పేషెంట్లను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసేముందు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌‌‌‌ టెస్ట్ చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పూర్తిగా కోలుకుని, ఆర్టీ పీసీఆర్ టెస్టులో వైరస్‌‌  నెగెటివ్ వచ్చిన తర్వాత మాత్రమే ఇలాంటి వారిని డిశ్చార్జ్ చేయాల్సి ఉంటుంది.

డిశ్చార్జ్ తర్వాత..

టెస్టులు చేయకుండా డిశ్చార్జ్ అవుతున్న పేషెంట్లు, 7 రోజుల పాటు హోమ్‌‌ ఐసోలేషన్‌‌లో ఉండాలి. ఇంట్లో ఎవరినీ ముట్టుకోకూడదు.ఎవరితో నేరుగా మాట్లాడకూడదు. డిశ్చార్జ్ అయ్యాక 14వ రోజు వీరి హెల్త్ కండీషన్‌‌ను వీడియో కాన్ఫరెన్స్‌‌లో డాక్టర్లు పరీశిలిస్తారు. హోమ్‌‌ ఐసోలేషన్‌‌లో ఉన్నప్పుడు తిరిగి లక్షణాలు మొదలైతే 104, లేదా 1075లో పేషెంట్‌‌ సంప్రదించాలి.