ఆనర్ నుంచి కొత్త ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌లు

ఆనర్ నుంచి కొత్త ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌లు

ఆనర్ తమ మ్యాజిక్‌‌‌‌‌‌‌‌బుక్ సిరీస్‌‌‌‌‌‌‌‌లో కొత్త వేరియంట్లను లాంచ్  చేసింది.  మ్యాజిక్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌14, ఎక్స్‌‌‌‌‌‌‌‌16  ల 2023 వెర్షన్లను తీసుకొచ్చింది. వీటిలో 12 వ జెనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమర్చారు. రెండు వేరువేరు స్టోరేజ్ ఆప్షన్స్‌‌‌‌‌‌‌‌లో వీటిని తెచ్చారు. ఆనర్ మ్యాజిక్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌14 ధర రూ. 48,999 నుంచి,  ఎక్స్‌‌‌‌‌‌‌‌16 ధర రూ. 50,999 నుంచి ప్రారంభమవుతోంది. వీటిని అమెజాన్‌‌‌‌‌‌‌‌లో కొనుక్కోవచ్చు.