ధరణిలో కొత్త మాడ్యుల్స్

ధరణిలో కొత్త మాడ్యుల్స్

హైదరాబాద్, వెలుగు : ధరణిలో సమస్యల పరిష్కారానికి కొత్త మాడ్యుల్స్ తో పాటు అవసరమైన మెకానిజాన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈమేరకు రెవెన్యూ ప్రిన్సిపల్​ సెక్రటరీ నవీన్ మిట్టల్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. స్టాంప్ డ్యూటీని ధరణి పోర్టల్ లోనే అడ్జస్ట్​మెంట్​ చేసేలా మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ఏజీపీఏ, ఎస్​పీఏ వంటివి అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఈమేరకు టీఎస్ మేనేజింగ్ డైరెక్టర్, కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.