ప్రేక్షకుల కోసం కొత్త షోస్‌‌ వస్తున్నయ్

V6 Velugu Posted on May 27, 2021

తెలుగు టెలివిజన్‌‌పై మరికొన్ని కొత్త షోలు రెడీ అవుతున్నాయి. వచ్చే నెల నుంచి ఎంటర్‌‌‌‌టైన్‌‌ మెంట్‌‌ షోస్‌‌తోపాటు, సీరియల్స్‌‌ కూడా స్టార్ట్‌‌ కాబోతున్నాయి. అవేంటంటే..

హ్యాపీడేస్‌‌
యాంకర్‌‌‌‌ రవి, అషురెడ్డి హోస్ట్‌‌లుగా చేస్తున్న మరో షో ‘హ్యాపీడేస్‌‌’. ఇప్పటికే ఈటీవీ ప్లస్‌‌లో ప్రారంభమైన ఈ షో కొన్ని వారాలు  ఆగిపోయింది. జూన్ 7 నుంచి ఈ షో మళ్లీ మొదలవుతోంది. సోమ వారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరున్నరకు టెలికాస్ట్‌‌ అవుతుంది. 

రెచ్చిపోదాం బ్రదర్‌‌‌‌
చాలాకాలం నుంచి ప్రోమోలతో ఊరిస్తున్న షో ‘రెచ్చిపోదాం బ్రదర్‌‌‌‌’. ఈటీవీ ప్లస్‌‌లో రాబోతున్న సరికొత్త ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్‌‌ షో ఇది. రాజీవ్ కనకాల బుల్లితెరపై రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ షోకి ఆయన జడ్జిగా ఉండబోతున్నాడు. ఇంతకుముందు కొన్ని టీవీ షోస్‌‌లో కనిపించిన మేఘన ఈ షో ద్వారా యాంకర్‌‌‌‌గా మారుతోంది. ఇది కామెడీ బేస్డ్‌‌ షో. జబర్దస్త్‌‌, పటాస్​ షోలకు చెందిన కమెడియన్స్‌‌తోపాటు యూట్యూబ్‌‌ స్టార్స్‌‌, టిక్‌‌టాక్‌‌ స్టార్స్‌‌, ‘ఢీ’ షో కంటెస్టెంట్స్‌‌ అంతా కలిసి కామెడీ స్కిట్స్‌‌ పర్ఫామ్‌‌ చేస్తారు. జూన్‌‌ ఏడు నుంచి ఈ షో మొదలవుతుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి తొమ్మిదింటికి షో టెలికాస్ట్‌‌ అవుతుంది. ఈటీవీ ప్లస్‌‌లో ‘పటాస్‌‌’ షో ఆగిపోయినప్పటి నుంచి ఈ ఛానెల్‌‌లో దాన్ని భర్తీ చేసే సరైన ఎంటర్‌‌‌‌టైన్‌‌ మెంట్‌‌ షో రాలేదు. ‘రెచ్చిపోదాం బ్రదర్‌‌‌‌’ ఆ లోటు తీరుస్తుంది అనుకుంటున్నారు.

జూలైలో ‘ఖత్రోంకే ఖిలాడి–11’
ఇండియన్‌‌‌‌ టీవీ స్క్రీన్‌‌‌‌పై సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌ రియాలిటీ షోస్‌‌‌‌లలో ఒకటి ‘ఖత్రోంకే ఖిలాడి’. కలర్స్‌‌‌‌ ఛానెల్‌‌‌‌లో ప్రసారమయ్యే ఇది ఒక అడ్వెంచరస్‌‌‌‌ రియాలిటీ షో. సినిమా, టీవీ రంగాలకు చెందిన సెలబ్రిటీలు పాల్గొంటారు. నిర్వాహకులు ఇచ్చిన అడ్వెంచర్స్​ టాస్క్‌‌‌‌లు, స్టంట్స్‌‌‌‌ చేయాలి. ప్రముఖ బాలీవుడ్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌ శర్మ ఈ షోను హోస్ట్‌‌‌‌ చేస్తున్నాడు. ఇప్పటికే పది సీజన్స్‌‌‌‌ పూర్తి చేసుకుంది. ఇప్పుడు పదకొండో సీజన్‌‌‌‌తో రెడీ అవుతోంది. దీనికి కారణం ఈ షో విదేశాల్లో షూటింగ్‌‌‌‌ జరుపుకోవడమే. దేశంలో కరోనా కారణంగా టీవీ షూటింగ్స్‌‌‌‌ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ‘ఖత్రోంకే ఖిలాడి’ షూటింగ్‌‌‌‌ కేప్‌‌‌‌టౌన్‌‌‌‌లో జరుగుతుండటంతో, ఈ 11వ సీజన్​కు ఏ అడ్డంకులు లేవని సమాచారం. కలర్స్‌‌‌‌ ఛానెల్‌‌‌‌ బిగ్‌‌‌‌బాస్‌‌‌‌ కొత్త సీజన్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేయాలను కున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల కారణంగా అది ఆగి పోయింది. దీంతో నిర్వాహకులు ‘ఖత్రోంకే ఖిలాడి–11’ను రెడీ చేస్తున్నారు. జూలై 21 నుంచి ఈ షో స్టార్ట్‌‌‌‌ అయ్యే ఛాన్స్‌‌‌‌ ఉందని సమాచారం. ఈ సీజన్‌‌‌‌లో దివ్యాంక త్రిపాఠి, అరుణ్‌‌‌‌ బిజ్లాని, రాహుల్‌‌‌‌ వైద్య, అభినవ్‌‌‌‌ శుక్లా, శ్వేతా తివారి వంటి సెలబ్రిటీస్‌‌‌‌ పార్టిసిపేట్‌‌‌‌ చేస్తున్నారు. 

‘సిక్స్త్‌‌సెన్స్‌‌’ సీజన్‌‌–4
స్టార్‌‌‌‌ యాంకర్‌‌‌‌  ఓంకార్‌‌‌‌ హోస్ట్‌‌ చేస్తున్న షో ‘సిక్స్త్‌‌ సెన్స్‌‌’  స్టార్​ మా ఛానెల్​లో ఇప్పటికే మూడు సీజన్స్‌‌ పూర్తి చేసుకుంది. త్వరలో నాలుగో సీజన్ మొదలవుతోంది. దీనికి సంబంధించి ప్రోమో ఈమధ్యే రిలీజ్‌‌ అయ్యింది. ఇది రియాలిటీ షో. సినిమా, టీవీ రంగాలకు చెందిన సెలబ్రిటీలు పాల్గొంటారు. వాళ్లు టాస్క్‌‌లు, గేమ్స్‌‌ ఆడాల్సి ఉంటుంది.  ఓంకార్‌‌‌‌ హోస్ట్‌‌గా చేసిన ‘డాన్స్‌‌ ప్లస్‌‌’ ఈ వారమే పూర్తైంది. ఈ షో పూర్తవడంతో, ‘సిక్స్త్‌‌ సెన్స్‌‌’ షోను లాంఛ్‌‌ చేయబోతున్నాడు ఓంకార్‌‌‌‌. ‘స్టార్‌‌‌‌ మా’లో ‘బిగ్‌‌బాస్‌‌–5’ స్టార్ట్‌‌ అయ్యేంత వరకు ఈ షో టెలికాస్ట్‌‌ కావచ్చు.

వైదేహి పరిణయం
తెలుగు ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్‌‌ ఛానెల్ జీ తెలుగులో రానున్న మరో కొత్త సీరియల్‌‌ ‘వైదేహి పరిణయం’. అన్నదమ్ముల అనుబంధం, కుటుంబ విలువలు, ప్రేమ... అంశాలతో ఈ సీరియల్‌‌ తీశారు. వైదేహి అనే అమ్మాయి, తన ప్రేమను దక్కించుకునేందుకు  ఏం చేసింది? అనేదే ఈ సీరియల్‌‌ కథ. పవన్‌‌, అంజన ఇందులో మెయిన్‌‌లీడ్స్‌‌. మరో నటి కరుణ ముఖ్యమైన పాత్ర చేస్తోంది. ఇప్పటికే రిలీజైన ప్రోమోలు ఆకట్టుకుంటున్నాయి. వచ్చే నెలలోనే ఈ షో మొదలవుతుంది.

Tagged Audience, TV shows, Entertainment programs, Happy days, Rechhipodam borther, Sixth sense, khatarnak khiladi 2, vydehi parinayam

Latest Videos

Subscribe Now

More News