V6 News

గాంధీ టీజీజీడీఏ కొత్త కమిటీ ఎన్నిక

గాంధీ టీజీజీడీఏ కొత్త కమిటీ ఎన్నిక

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ (టీజీజీడీఏ) యూనిట్ కొత్త కార్యవర్గం కొలువుదీరింది. హాస్పిటల్​ ప్రాంగణంలో గురువారం జరిగిన కార్యక్రమంలో కొత్త అధ్యక్షుడిగా డాక్టర్ ఆవుల మురళీధర్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ డి. విష్ణు కుమార్, కోశాధికారిగా డాక్టర్ జి. ఉపేందర్ బాధ్యతలు స్వీకరించారు.

వైస్ ప్రెసిడెంట్స్​గా డాక్టర్ దేవోజీ, డాక్టర్ బి. చంద్రవతి, డాక్టర్ ఎం. సరిత, జాయింట్ సెక్రటరీలుగా డాక్టర్ టి. కృపాల్ సింగ్, డాక్టర్ కె. దివ్య రాణి, డాక్టర్ పి. ఝాన్సీ రాణి నియమితులయ్యారు. అలాగే జనరల్ కౌన్సిల్ సభ్యులుగా డాక్టర్ జె. భూపేందర్ సింగ్ రాథోడ్, డాక్టర్ పి. అబ్బయ్య, డాక్టర్ జి. రవి ఎన్నికవగా, డాక్టర్ జి. భువనేశ్వరి, డాక్టర్ డి. సుచేత సహా మరికొందరు ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఎన్నికయ్యారు.