స్పీడ్ తక్కువైతే ORRలోకి నో ఎంట్రీ : ఏ లైన్ లో ఎంత స్పీడ్ తో వెళ్లాలంటే..

స్పీడ్ తక్కువైతే ORRలోకి నో ఎంట్రీ : ఏ లైన్ లో ఎంత స్పీడ్ తో వెళ్లాలంటే..

హైదరాబాద్  ఔటర్ రింగ్ రోడ్డుపై కొత్త ట్రాఫిక్ రూల్స్  వచ్చాయి. ఔటర్ పై కొత్త స్పీడ్ లిమిట్స్ సంబంధించి  సైబరాబాద్ పోలీసులు కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ రూల్స్  సోమవారం (జులై31) నుంచి అమల్లోకి రానున్నాయి.40 కిలోమీటర్ల కంటే తక్కువ స్పీడ్ వెళ్లే వాహనాలకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు..  పాదచారులకు  అనుమతివ్వబోమని వెల్లడించారు. 

ఇటీవల కాలంలోనే ఓఆర్ఆర్ పై   స్పీడ్ లిమిట్ కూడా పెంచింది ప్రభుత్వం. గతంలో మ్యాక్సిమమ్ స్పీడ్ 100 ఉంటే 120కి పెంచింది. ఇపుడు లైన్ ల వారీగా స్పీడ్ లిమిట్ ను డిసైడ్ చేస్తూ ఉత్తర్వులుజారీ చేసింది. కనీస స్పీడ్ 40 ఉండాలని నిర్ణయించింది. 40కి.మీ వేగంకంటే తక్కువ వెళ్లే వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. 

ఏ లైన్ లో ఎంత స్పీడ్ తో వెళ్లాలంటే

  • లైన్ 1 అండ్ 2 లో 100 - 120 కిలోమీటర్లు స్పీడు 
  • లైన్ 3 అండ్ 4 లో 80 - 100 కిలోమీటర్ల స్పీడు 
  • 5 వ లైన్ లో 40 కిలోమీటర్ల స్పీడ్ 
  • 40 కిలోమీటర్ల స్పీడ్ కు తక్కువ వెళ్లే వాహనాలకు ఔటర్ పై అనుమతి లేదు.
  •  టూవీలర్స్ కి.. పాదచారులకు  అనుమతి లేదని చెప్పిన పోలీసులు