
హైదరాబాద్ : శామీర్ పేట్ అనుమానస్పద మృతి కేసులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ నెల 15వ తేదీన మిస్సయిన ఐదేళ్ల బాలుడు చనిపోయాడు. అయితే ముందుగా కిడ్నాప్ అయ్యాడనున్న పోలీసులకు…. విచారణలో అసలు విషయాలు తెలిశాయి. బాలుడు ఉంటున్న ఇంటిపైనే ఉంటున్న సుధాంశ అనే యువకుడే.. బాలున్ని చంపినట్టు పోలీసులు తేల్చారు. షేర్ చాట్ లో వీడియో తీస్తున్న టైంలో అధియాన్ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. విషయం బయటకు తెలిస్తే ఇబ్బంది అని భావించిన నిందితుడు.. బాలుడిని ఇంట్లోకి తీసుకెళ్లి గొంతుపిసికి చంపేశాడు. తర్వాత డెడ్ బాడీనీ సంచిలో వేసుకుని తీసుకెళ్లి ఔటర్ రింగ్ రోడ్ పక్కన చెట్ల పొదల్లో పడేశాడు.