న్యూ వ్యాక్సిన్‌ పాలసీ నోట్ల రద్దు లాంటిది

న్యూ వ్యాక్సిన్‌ పాలసీ నోట్ల రద్దు లాంటిది

దేశంలో కరోనా కట్టడిలో భాగంగా దశల వారీగా వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. ఇందులో భాగంగా .. పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ కొరత ఏర్పంది. ఈ కారణంగా వ్యాక్సిన్‌ కొనుగోలులో రాష్ట్రాలకు, ప్రైవేట్ రంగానికి స్వేచ్ఛ కల్పిస్తూ.. మే 1 నుంచి మార్పులు చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ వ్యాక్సినేషన్‌ కొనుగోలు విధానంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూ  వ్యాక్సిన్‌ పాలసీ.. నాలుగేళ్ల క్రితం ప్రకటించిన నోట్ల రద్దు లాంటిదేనని అన్నారు. సామాన్య ప్రజలు వ్యాక్సిన్‌ కోసం క్యూలైన్లో నిల్చుంటారు. ఆరోగ్యం.. ఆస్తులతో పాటు చివరకు ప్రాణాల్ని కూడా కోల్పోతారు. చివరగా బడా పారిశ్రామికవేత్తలే ప్రయోజనం పొందుతారంటూ  ప్రభుత్వాన్ని విమర్శించారు.

నిన్న(మంగళవారం) కరోనా బారిన పడ్డ రాహుల్‌గాంధీ.. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.