
ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాలుగా మొదట చైనా, తర్వాత భారత్ నిలిచినా, వచ్చే ఏడాదిలో మనం చైనాను అధిగమిస్తామట. కాని ఇప్పుడు కరోనా తరువాత న్యూజిలాండ్ లో భారీగా జనాభాపెరిగింది. జనాభా పెరుగుదలైనా, తగ్గుదలైనా పూర్తి మంచీ కాదు, చెడూ కాదు. ఆ జనాభాను ఎలా వినియోగిస్తున్నామన్నదే ముఖ్యం. సవాళ్ళను అధిగమించే జనసామర్థ్యమే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనను నిర్ణయిస్తుంది. అయితే కరోనా తరువాత న్యూజిలాండ్ లో కరోనా తరువాత జనాభా పెరుగిందని ఆ దేశ గణాంకాల విభాగం తెలిపింది. గతేడదితో పోలిస్తే 2023 జూన్ 30 నాటికి న్యూజిలాండ్ లో 2.1 శాతం మంది పెరిగి 5.22 మిలియన్లకు చేరుకున్నారని గణాంకాల అధికారి మైఖేల్ మాక్ అస్కిల్ తెలిపారు. న్యూజిలాండ్ లో జనాభా పెరుగుదలకు వలసలే కారణమని ఆయన తెలిపారు.
గత రెండేళ్లలో కోవిడ్ కారణంగా జనాభా తగ్గిందని తెలిపారు. ప్రస్తుతం ఈ ఏడాది జనాభా వృద్ది రేటును సాధించింది. న్యూజిలాండ్ జనాభా గణాంకాల్లో మార్పు సహజమని తెలిపారు. అయితే కరోనా ముందున్న లెక్కలతో పోలిస్తే ఇప్పుడు అంతగా పెరుగుదల లేదని మాక్‌అస్కిల్ తెలిపారు. న్యూజిలాండ్ లో వృద్దుల సంఖ్య ఎక్కువుగా ఉన్నారని అందుకే ప్రతి ఏడాది మరణాల సంఖ్య పెరుగుతోందని మాక్ అస్కిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది కొద్దిగా జనాభా సంఖ్య పెరిగిందని ఆయన తెలిపారు.